Saturday, November 23, 2024

చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రోత్సాహంపై ప్ర‌భుత్వంతో భేటీ

గ్రానైట్ , గ్రానైట్ అనుబంధ చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ఇతర సంబంధిత సమస్యలపై పరిశ్రమ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, మైనింగ్ శాఖ డీఎంజీ రొనాల్డ్ రోస్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వరరావులతో పరిశ్రమ ప్రతినిధులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఆధ్వర్యంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు.

40% రిబేట్ తో కూడిన స్లాబ్ విధానాన్ని కొనసాగించాలని, కొత్త పరిశ్రమలకు లీజులు, ప్రోత్సాహకాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రతినిధులు హామి ఇచ్చారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వ పెద్దలకు అందజేశారు. ఈ సమావేశంలో మైనింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, గ్రానైట్ పరిశ్రమల సంఘం ప్రతినిధులు పి. శంకర్, తమ్మినేని వెంకట్రావు, ఉప్పల వెంకటరమణ, విన్నకోట అజయ్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement