టెన్నిస్ సూపర్ స్టార్ నోవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ లో నిరాశే ఎదురైంది. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ సంచలనం సృష్టించాడు. వరుస సెట్లలో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు జకోవిచ్‌ను మట్టికరిపించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్ ఇంకొన్ని రోజులపాటు ఆగాల్సిందే. జకోవిచ్ ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ సరసన చేరాడు. ముగ్గురు టెన్నిస్ వీరులు ఒకే నంబర్ వద్ద ఆగిపోవడం గమనార్హం.
ఆట ప్రారంభమైనప్పటి నుంచి చివరివరకు అత్యుత్తమ ర్యాంకుల్లో ఉన్న ఇద్దరిమధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగింది.
ఆర్థర్ ఆషే స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6-4, 6-4, 6-4 తేడాతో తిరుగులేని విజయం సాధించాడు. దీంతో మొదటిసారిగా గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన సొంతం చేసుకున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ టోర్నీలో ఒక్కసెట్‌లో మాత్రమే ఓడిపోయి టైటిల్ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. మెద్వెదెవ్కు ఇది మూడో గ్రాండ్ స్లామ్ ఫైనల్ కావడం విశేషం. గతంలో యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ విజయం సాధించలేకపోయాడు.
ఇది కూాడా చదవండి: రోజుకు 3 లక్షల మందికి వ్యాక్సిన్: సీఎం కేసీఆర్ కీలక ఆదేశం