ప్లిప్ కార్ట్ ఇది ఆన్ లైన్ సంస్థ అని అందరికీ తెలిసిందే..దీనిలో ఎన్నో రకాల వస్తువులు, షాపింగ్ కి కావల్సిన సరుకులు లభిస్తుంటాయి..ఒకటో రెండో వస్తువులు తప్పా..ఆల్ మోస్ట్ అన్ని వస్తువులు ఈ కామర్స్ సంస్థలో లభ్యమవుతుంటాయి. కాగా ఇప్పటి వరకు షాపింగ్ కోసమే ఉపయోగించిన ఈ ప్లిప్ కార్ట్ ఇకపై హెల్త్ ప్లస్ సేవలను అందించనుంది. ఈ మేరకు సస్తా సుందర్ మార్కెట్ ప్లేస్ అనే ఆన్ లైన్ ఫార్మసీ సంస్థ నుంచి మెజారీటి వాటాను కొనుగోలు చేసింది.భవిష్యత్తులో ఈ-డయాగ్నెస్టిక్స్, ఈ-కన్సల్టేషన్ల సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. సస్తాసుందర్.కామ్.. డిజిటల్ హెల్త్‌కేర్, ఫార్మసీ రంగానికి సంబంధించి 490 ఫార్మసీల నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ‘ఫ్లిప్‌కార్ట్ హెల్త్ +’, ఇప్పుడు సస్తాసుందర్ సహా ఫ్లిప్‌కార్ట్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని ఈ-ఫార్మసీ రంగంలో మెరుగైన సేవలు అందించనుందని సంస్థ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..