Tuesday, November 26, 2024

Medical Miracle: మనిషికి పంది కిడ్నీ మార్పిడి.. ప్రాబ్లం లేదంటున్న‌ డాక్ట‌ర్లు.. ఎక్క‌డో తెలుసా!

Transplantation: అవయవ మార్పిడిలో అమెరికా డాక్ట‌ర్లు సరికొత్త రికార్డు సృష్టించారు. అవయవాల కొరతను అధిగమించడంలో భాగంగా మనిషికి పంది మూత్రపిండాన్ని అమర్చారు. అది చక్కగా తన పని తాను చేసుకుపోతుండడం గమనార్హం. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.

బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తిపై గత నెలలో ఈ అవయవ మార్పిడి ప్రయోగం చేపట్టారు. పంది మూత్రపిండాన్ని మనిషికి అమర్చిన తర్వాత మూడు రోజులపాటు దాని పనితీరును పరిశీలించారు. ఇది రోగ నిరోధకశక్తిపై ఎలాంటి ప్రభావం చూపించలేదని, సాధారణంగానే పనిచేసిందని ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ రాబర్ట్ మోంట్గోమెరి పేర్కొన్నారు.

సాధారణంగా పంది కణాల్లోని గ్లూకోజ్ మనిషికి సరిపోదని.. దీంతో మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ దాన్ని అంగీకరించదని తెలిపారు. ఈ నేపథ్యంలో జన్యు సవరణ చేసిన పంది నుంచి కిడ్నీని సేకరించి మనిషికి అమ‌ర్చిన‌ట్టు చెప్పారు. పంది కిడ్నీలోని చ‌క్కెర స్థాయులను తగ్గించడం ద్వారా మానవ రోగ నిరోధక వ్యవస్థ దాన్ని తిరస్కరించకుండా చూసుకున్నారు. ప్రస్తుతం ఇది చక్కగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement