తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇందరారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ లో ఉండగా… సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లాకు తొలిస్థానం దక్కింది.
ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో చివరి స్థానంలో మెదక్…
ప్రైవేట్ జూనియర్ కాలేజీలో 63 శాతం ఉత్తీర్ణత…
గురుకుల జూనియర్ కాలేజి ల్లో 92శాతం…
సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 89 శాతం…
బీసీ గురుకుల 87 శాతం ఉత్తీర్ణత…
కేజీబీవీలలో 77శాతం, ట్రైబల్ 84 శాతం…
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 54 శాతం ఉత్తీర్ణత…
రేపటి నుంచి రీ కౌంటింగ్, రీ వ్యాల్యుయేషన్ కి అవకాశం…
ఈనెల 16 వరకు ఫీజు కట్టేందుకు అవకాశం…
ఈ రోజు సాయంత్రం నుండి కలర్ మెమోలు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం