Tuesday, November 19, 2024

మేడారం జాతరకు ప్రత్యేక బస్సు సెంటర్లు – ప్రారంభించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..వరంగల్ లోని పండ్ల మార్కెట్ లో ఆర్టీసీ బస్ సెంటర్ ను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు..టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకున్నారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం..మహిమగల్ల తల్లులు సమ్మక్క సారలమ్మలు..ఆ తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి..మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతరకు ప్రతీసారి గొప్పగా ఏర్పాట్లు చేస్తున్నారు..వరంగల్ జిల్లా నుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 5 సెంటర్లు ఏర్పాటు చేసి 360 బస్సులను ఏర్పాటు చేశార‌ని తెలిపారు..భక్తులంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అమ్మవార్లను దర్శించుకుని, వారి ఆశీర్వాదం పొందాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్,సోమిశెట్టి ప్రవీణ్,చింతాకుల అనీల్,మాజీ కార్పోరేటర్ జారతి అరుణ రమేష్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టీ.రమేష్ బాబు,ఆర్టీసీ అదికారులు,మార్కెట్ ప్రతినిదులు,ముఖ్యనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement