తెలంగాణ కుంభమేళాగా ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర.. నేటి నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు వైభవంగా జరగనుంది. వన దేవతలు జనం నడుమ మొక్కులందుకోనున్నారు. ఇప్పటికే భక్తుల కిటకిటతో మేడారం పరిసరాల్లో జనసంద్రం నెలకొంది. మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ నెల19 వరకు అంగరంగ వైభవంగా జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 18న వన దేవతలను దర్శిస్తారు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. దాదాపు నలభై వేల మంది సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మొత్తం కోటిన్నర మంది వరకు సందర్శించే వీలుందనేది అధికారుల అంచనా వేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement