హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి ఛార్జీలు పెద్దలకి రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. నేటి నుంచే ఈ బస్సులు ప్రారంభకానున్నాయి. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క,సారలమ్మ మహా జాతర ఫిబ్రవరి రెండవ వారంలో జరగనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లపై ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జాతర దృష్ట్యా ఇప్పటి నుంచే భక్తుల రాక పోకలు పెరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..