కరోనా ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. ఇప్పటికి కరోనా జాడలు ఇంకా సమసిపోలేదు. అసలు ఈ మహమ్మారి ఎలా పుట్టింది..ఎక్కడ పుట్టిందో కూడా తెలియని పరిస్థితి. కరోనా కట్టడికి పలు రకాల వ్యాక్సిన్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. రెండేళ్ళుగా యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి చైనా లోనే మూలాలున్నాయని తెలిసిన విషయమే. చైనా ప్రజల అడ్డమైన ఆహారపు అలవాట్లే ఈ కరోనా వ్యాధికి కారణమని ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. పాములు, తేళ్లు, కుక్కలు.. ఒక్కటా రెండా ఈ భూమిపై ఉండే ప్రతి జీవి చైనీయులకి భోజనాహారమే. కరకరమని నమిలేస్తారు.
అందుకే కరోనా లాంటి కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఐతే తాజాగా ఓ యువతి వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. ఇంటి టెర్రస్‌పై తేళ్ల ను సాగు చేస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఇంట్లో కోళ్లను పెంచుకున్నట్లుగా ఆ యువతి తన ఇంటిపై ఎర్ర తేళ్లను పెంచుతోంది. ఏదో సరదా కోసం అయితే ఒకటి రెండు ఉంటాయి. కానీ ఆ ఇంటి డాబాపై వేల సంఖ్యలో తేళ్లు సాగవుతున్నాయి. మరో ముప్పు రానుందని అర్థమవుతోంది. ఇంత జరిగినా చైనీయులు మారరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily