Saturday, November 23, 2024

ఎంసీఐ, కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

పీజీ నీట్ సీట్ల భర్తీ విషయంలో సుప్రీంకోర్టు ఎంసీఐ, కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడింది. 2021-22 విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మనకు వైద్యులు, సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు చాలా అవసరమని, విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకపోతే, వారికి పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. రేపు కోర్టులో ఎంసీఐ, కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరుకావాలని, వారి సమక్షంలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement