Tuesday, November 26, 2024

మే నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయి?

ఏప్రిల్ నెల దాదాపు ముగింపు దశకు వచ్చింది. మే నెల వచ్చేస్తోంది. మే నెలలో మొత్తం 9 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. రెండో శనివారం, నాలుగో శనివారం, ఐదు ఆదివారాలతో పాటు మేడే, రంజాన్ హాలిడే ఉన్నాయి. మరి ఏఏ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోండి.

మేలో బ్యాంకులకు సెలవులు ఇవే..
మే 1- మేడే, మే 2- ఆదివారం, మే 8- రెండో శనివారం, మే 9- ఆదివారం, మే 14- రంజాన్, బసవ జయంతి, అక్షయ తృతీయ, మే 16- ఆదివారం, మే 22- నాలుగో శనివారం, మే 23- ఆదివారం, మే 30- ఆదివారం

ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్ని కుదించాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్-IBA అన్ని బ్యాంకులకు సూచించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సేవలు అందించాలని కోరింది. మేలో ముఖ్యమైన లావాదేవీలు జరిపేవారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలకు ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకు సేవలు అందుబాటులో లేని సమయంలో మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్ సేవలు ఉపయోగించుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement