తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్ మరోసారి పొడిగించవద్దని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. పగటి పూట పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేసి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేసే అవకాశముందని తెలుస్తోంది. లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం పలు వ్యాపారాలతో పాటు మెట్రో రైళ్లకు, ఆర్టీసీ బస్సులకు సాయంత్రం 7 వరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు కొనసాగుతున్నాయి. ఈ నెల 9తో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ముగియనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement