Thursday, November 21, 2024

మస్క్​ మామకు మస్త్​ ట్వీట్లు.. కేటీఆర్‌కు సపోర్టుగా సినీనటులు, జర్నలిస్ట్‌ల ట్వీట్లు

టెస్లా కంపెనీని తెలంగాణలో ఏర్పాటుచేయాలని సంస్థ సీఈవో ఎలాన్‌ మస్క్‌కు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ఇచ్చిన ఆహ్వానానికి సినీ ప్రముఖులు, జర్నలిస్ట్‌లు మద్దతు తెలిపారు. టెస్లాకు తెలంగాణ కరెక్ట్‌ ప్లేస్‌ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇది వైరల్‌గా మారింది. వేల మంది ట్వీట్లు చేయడంతో ఎలాన్ మస్క్‌, టెస్లా హ్యాష్‌ట్యాగ్‌లు రెండ్రోజుల నుంచి ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో టాప్​లో నిలుస్తున్నాయి. వాటిలో సినీ ప్రముఖులు, జర్నలిస్టుల ట్వీట్లు కొన్ని..

ఎలాన్‌మస్క్‌ హైదరాబాద్‌కు రండి. మీ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేయడం మాకు గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇట్లాంటి విషయాల్లో మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది..

–నటుడు, విజయ్‌ దేవరకొండ

‘ఎలాన్‌మస్క్‌ సార్‌.. మీకు తెలంగాణలో అత్యుత్తమ భూమి, మౌలిక సదుపాయాలు లభిస్తాయి. అఫ్‌కోర్స్‌ బెస్ట్‌ మినిస్టర్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటర్‌ కేటీఆర్‌ ఉన్నారు’
-టాలీవుడ్‌ డైరెక్టర్‌, మెహర్‌ రమేశ్‌

‘డియర్‌ ఎలాన్‌మస్క్‌. మేం తెలంగాణలో టెస్లాను కలిగి ఉండాలనుకుంటున్నాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, భారతదేశంలోనే లీడింగ్‌ బిజినెస్‌ హబ్‌ను కలిగి ఉన్నాంస‌‌
‌– దర్శకుడు, గోపిచంద్‌ మలినేని

- Advertisement -

‘కేటీఆర్‌ బాగా చెప్పారు. వ్యాపారాలు సమర్థవంతమైన గమ్యస్థానాల వైపు చూస్తాయి. గ్లోబల్‌ బ్రాండ్‌లు తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి సహకరించే పాలన, అనుకూలమైన వాతావరణం తప్పనిసరిగా ఉండాలి’
-జర్నలిస్ట్‌ అమీన్‌ అలీ

‘టెస్లా రేస్‌లో హైదరాబాద్‌.. బెంగళూరును అధిగమించింది. ఎలాన్‌మస్క్‌ను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌కు పుల్‌ మార్క్‌లు’
– గో న్యూస్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ పంకజ్‌ పచౌరి

‘ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎలాన్‌మస్క్‌ చెప్పిన తరువాత.. వినూత్నంగా మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ఆహ్వానం పంపించారు. మనం తెలంగాణలో టెస్లా ఫ్యాక్టరీని చూడబోతున్నామా..?’
-ఎడిటర్‌జీ వ్యవస్థాపకుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ విక్రమ్‌చంద్ర

‘ఆకస్తికరమైన విషయం ఏంటంటే.. పరిశ్రమలను ఆకర్షించడానికి అనేక రాష్ర్టాలు సింగిల్‌విండో క్లియరెన్స్‌ను అందిస్తున్నప్పటికీ, తెలంగాణలో ఈ సింగిల్‌విండో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉందని సీఎం కేసీఆర్‌ చెబుతుంటారు. పదిహేను రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే మీ ప్రాజెక్ట్‌ ఆమోదించబడినట్లు భావించబడుతుంది’

సీనియర్‌ జర్నలిస్ట్‌ ఉమా సుధీర్‌
‘వాట్‌ ఏ పర్సన్‌. లెట్స్‌ గెట్‌ టెస్లా టు తెలంగాణ’
– నటుడు, నిఖిల్‌ సిద్ధార్థ

Advertisement

తాజా వార్తలు

Advertisement