న్యూయార్క్ : అత్యంత దారుణమైన అగ్నిప్రమాదం తూర్పు అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో చోటు చేసుకుంది. మూడంతస్తుల బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులతో సహా 13మంది మృతి చెందారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఫిలడెల్ఫియా ఫైర్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ కమిషనర్ క్రెయిగ్ మర్ఫీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. లోపల ఇంకా రికవరీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. తన 35 ఏళ్ల సర్వీసులో తాను చూసిన అత్యంత దారుణమైన అగ్నిప్రమాదం ఇదేనని ఆ అధికారి విచారం వ్యక్తం చేశారు.
అయితే ఈ ప్రమాదానికి కారణాలేమిటో, మంటలు ఎలా చెలరేగాయో ఇప్పుడే చెప్పలేమని.. ఈ విషయం మీద తమ డిపార్ట్‌మెంట్ విచారణ జరుపుతోందని మర్ఫీ వెల్లడించారు. ఈ ప్రమాదం మీద ఎలాంటి అనుమానాలూ లేవు. ఇది కావాలని చేసిందనిమేం అనుకోవడం లేదన్నారు. కాకపోతే ఈ ఘటన మీద అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం అని మీడియాకి వెల్లడించారు. ఈ ప్రమాదఘటన మీద అతున్నత స్థాయి పరిశోధన జరిపిస్తాం అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..