వాల్ మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అమెరికాలోని ఇండియానాపొలిస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాల్‌మార్ట్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి గోదాం మొత్తం విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతంలో నల్లటి పొగలు పెద్దఎత్తున కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 200 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో వెయ్యి మంది పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎవరు గాయపడలేదని వెల్లడించారు. వేర్‌హౌస్ మొత్తం పది లక్షల 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నదని చెప్పారు. భారీగా పొగలు కమ్ముకోవడంతో గోదాం చుట్టుపక్కన ఉన్న ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దని, కిటకీలు, తలుపులు మూసే ఉంచుకోవాలని సూచించామన్నారు.
వాల్ మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం – ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిక
Advertisement
తాజా వార్తలు
Advertisement