పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో మరో 13మంది తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. యూనిట్-4లో గ్యాస్ లీకవడంతో మంటలు చెలరేగి రియాక్టర్ పేలిపోయి భారీ శబ్దంతో మంటలు వచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘోర ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరోకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిని మొదట నూజివీడు ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆ టైమ్‌లో ఫ్యాక్టరీలో 50 మంది ఉన్నట్లు సమాచారం. ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నామని చెప్పారు.
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం – ఆరుగురు మంది మృతి – పలువురికి తీవ్ర గాయాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement