పాకిస్థాన్‌లో ఈరోజు భారీ పేలుడు ఘటన జరిగింది. పెషావర్‌లోని ఓ మసీదులో జరిగిన పేలుడులో 30 మంది మరణించినట్లు తెలుస్తోంది. సూసైడ్ అటాక్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. లేడీ రీడింగ్ హాస్పిటల్‌కు చెందిన అధికారులు మృతదేహాలను గుర్తిస్తున్నారు. ఈ ఘటనలో మరో 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పెషావర్ సిటీ పోలీసు ఆఫీసర్ ఇజాజ్ అషాన్ మాట్లాడుతూ… తాజా పేలుడులో ఓ పోలీసు అధికారి మృతిచెందినట్లు చెప్పారు. 30 మృతదేహాలను హాస్పిటల్‌కు తీసుకువచ్చినట్లు లేడీ రీడింగ్ హాస్పిటల్ మేనేజర్ అసిమ్ ఖాన్ తెలిపారు. మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడ్డ వారికి చికిత్స ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. సంబంధిత అధికారుల నుంచి పేలుడు ఘటనకు చెందిన నివేదికను ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital