తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన 45 ఏళ్ల మత్స్యకార మహిళపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి, ఆతర్వాత హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని రొయ్యల ఫారంలో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం మహిళ పని నుండి తిరిగి రాకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆ మహిళ కోసం వెతకడానికి బయల్దేరారు. ఆ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారు ఆమెను హత్య చేశారు. మహిళ గుర్తించొద్దనే ఉద్దేశంతో నిందితులు ఆమె ముఖాన్ని కాల్చారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ప్రాంతంలోని రొయ్యల ఫారంలో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులపై సరైన చర్యలు తీసుకునే వరకు మహిళ మృతదేహాన్ని అంగీకరించేది లేదని ఆ ప్రాంతంలోని ప్రజలు ఆసుపత్రి వెలుపల నిరసన కూడా వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన ప్రజలు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకునేలోపే దాడి చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement