తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 38 కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. కరోనా నియమాలను మరింత కఠినతరం చేస్తూ చర్యలు తీసుకుంది. ఇప్పటికే మాస్కులు ధరించని వారికి రూ. వెయ్యి జరిమానా విధించే విధంగా నిబంధనలను అమలు చేస్తోంది.
తాజాగా ఇక నుంచి హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లోకి మాస్కులు ధరిస్తేనే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రోగులు, వారి సహాయకులు కచ్చితంగా మాస్కులు ధరించాలని, లేదంటే అనుమతించొద్దని తెలిపారు. ఈ మేరకు అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital