Friday, November 22, 2024

సినిమాహాల్స్ లో.. మాస్క్ త‌ప్ప‌నిస‌రి

మ‌ళ్లీ విజృంభిస్తోంది క‌రోనా.. దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దాంతో తమిళనాడు సర్కారు మార్గదర్శకాలను విడుదల చేసింది. సినిమా థియేటర్లలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, ఏసీ థియేటర్లు, ఆడిటోరియాలలో మాస్కులు ధరించాలని చెప్పారు.కేసులు పెరుగుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. థియేటర్లతో పాటు ఆసుపత్రులకు వెళ్లే రోగులు, రోగుల బంధువులు కూడా మాస్క్ ధరించాలని సూచించింది. కరోనా వ్యాప్తి పెరుగుతుండడంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని తెలిపారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement