Saturday, November 23, 2024

పోస్ట్ తెచ్చిన తంటా.. ఆగిపోయిన పెళ్లి

హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పెళ్లి కాబోతున్న యువతిపై దారుణ పోస్టులు చేశాడు. అంతేకాకుండా సదరు యువతిని పెళ్లి చేసుకోబోయే యువకుడికి ఈ పోస్టులను షేర్ చేశాడు. ఇంతటితో ఆగకుండా‘నువ్వు పెళ్లి చేసుకోబోయే పిల్ల నాది’ అని అసభ్యకరంగా సందేశాలు పంపాడు. నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చంపేస్తానని బెదిరించాడు. ఈ మేసేజ్‌లను చూసిన వరుడు తన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. అటు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టిన ఇంజినీరింగ్ స్టూడెంట్ వివేక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి వివేక్‌ను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement