Tuesday, November 26, 2024

ఆర్య సమాజ్​లో పెళ్లిళ్లు చెల్లవ్​.. సంచలన తీర్పు వెలువరించిన సుప్రీం

ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆర్య సమాజ్‌లో వివాహ సర్టిఫికెట్లను ఇకపై గుర్తించబోమని ధర్మాసనం ఇవ్వాల స్పష్టం చేసింది. పెళ్లిళ్లు చేయడం ఆర్య సమాజ్ పని కాదని సుప్రీం వ్యాఖ్యానించింది. జస్టిస్ అజయ్ రస్తోగి, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

సమర్థవంతమైన ప్రభుత్వ అధికారులు మాత్రమే వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయగలరని సుప్రీం స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో ప్రేమ వివాహానికి సంబంధించిన కేసులో కోర్టు పరిశీలన చేస్తోంది. నిజానికి ఆర్య సమాజ్ ఒక హిందూ సంస్కరణవాద సంస్థ. దీనిని 1875లో స్వామి దయానంద్ సరస్వతి స్థాపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీని శాఖలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement