Saturday, November 23, 2024

వారంలోగా వేలాది సంఖ్య‌లో పెళ్ళిళ్లు – ఎందుకంటే

పెళ్ళిళ్ల‌కి మంచి ముహుర్తాలు ఉంటే చాలు. అది ఏ నెల అనేది చూడ‌రు. అందుకే ఈ నెల‌లో తెగ పెళ్ళిళ్లు అవుతున్నాయి. దీనికి కార‌ణం ఇది మార్గ‌శిర‌మాసం కావ‌డ‌మే. ఈ నెల దాటితే పుష్య‌మి వ‌స్తుంది. ఆ మాసంలో మంచి ముహుర్తాలు లేవు. అందుకే ఈ నెల‌లోనే అధికంగా పెళ్ళిళ్లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 29వ‌ర‌కే శుభ‌ముహుర్తాలు ఉన్నాయి. ఈ వారంలోగా వేలాది సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్లు పండితులు తెలిపారు. అందుకే చాలామంది పెళ్లి పీటలెక్కడానికి ఆసక్తి చూపుతున్నారు. రికార్డు సంఖ్యలో ఈ వారంలో జంటలు ఒక్కటవ్వబోతున్నారు. వచ్చే వారంలో ఎక్కవ సంఖ్యలో వివాహాలు ఉండడం వల్ల ఫంక్షన్ హాళ్లకు కొరత ఏర్పడింది.

ఏసీ నాన్ ఏసీ నార్మల్ కల్యాణ మండపాలకు సైతం డిమాండ్ ఏర్పడింది. ఏదైనా సరే బుక్ చేసుకోవాలని అనుకున్నా దొరకడం లేదట‌. చేసేది లేక గుడిలోనూ పెళ్లిళ్లను కానిచ్చేస్తున్నారు. టెంపుల్ పెళ్లి తంతు పూర్తయ్యాక… రిసెప్షన్ ఘనంగా జరుపుకుందాం అని ఆలోచిస్తున్నారు ప‌లువురు. మరి ఇంత హడావిడిగా పెళ్లిళ్లు ఎందుకు చేస్తున్నార‌నుకుంటున్నారా. అయితే ఇటీవల కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ దేశాలు ఈ వేరియంట్ కు వణికిపోతున్నాయి. కేసులు మరింతగా పెరిగి… లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తుందని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక విదేశాలకు వెళ్లేవారు కూడా పెళ్లి చేసుకోవడానికి అందుకే తొందర పడుతున్నారు. మళ్లీ అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందంటున్నారు. అందుకే మంచి ముహుర్తం చూసుకుని పెళ్ళితంతుని కానించేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement