తాజాగా రష్యా బలగాలు ..ఉక్రెయిన్ లోని మారియుపోల్ లోని చిన్న పిల్లల హాస్పటల్ పై దాడి చేశాయి. కాగా నేడు పీడియాట్రిక్, ప్రసూతి ఆసుపత్రిని దాడి చేశాయి. ఈ చిన్న పిల్లల ఆస్పత్రిపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపించి… విధ్వంసం చేసింది. ఈ విషయాన్ని సిటీ కౌన్సిల్ ప్రకటించింది. అయితే దీని నష్టం పెద్ద స్థాయిలో ఉండే అవకాశముందని సిటీ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికి వరకు కనీసం 17 మంది గాయపడ్డారని స్థానిక అధికారి పావ్లో కైరిలెంకో తెలిపారు.
ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ట్విటర్‌లో పెద్ద మెడికల్ కాంప్లెక్స్‌లో భారీ విధ్వంసాన్ని చూపించే వీడియోను పోస్ట్ చేసారు. ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని అజోవ్ సముద్రంలోని మారియుపోల్‌ను రష్యన్ దళాలు చుట్టుముట్టాయి, వారు పౌరులను ఖాళీ చేయడానికి కాల్పుల విరమణ హామీ ఇచ్చినప్పటికీ నగరంపై బాంబు దాడి చేశారు.ఉక్రెయిన్ ప్రెసిడెండ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దేశంపై నో-ఫ్లై జోన్ విధించాలని మళ్లీ పిలుపునిచ్చారు. దీన్ని చేయడానికి NATO నిరాకరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..