Tuesday, November 26, 2024

రైల్వే ట్రాక్​ పేల్చేసిన మావోయిస్టులు.. రైళ్ల రాకపోకలు బంద్​.. అగ్రనేత బోస్​ ను అరెస్టు చేసినందుకే..

జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున మావోయిస్ట్)లు రైల్వే ట్రాక్​ని పేల్చేశారు. దీంతో రైల్వే ట్రాక్‌లలో కొంత భాగం దెబ్బతిన్నట్లు ఆర్‌పీఎఫ్ ధన్‌బాద్ సీనియర్ కమాండెంట్ హేమంత్ కుమార్​ తెలిపారు. పేలుడు సంభవించిన తర్వాత హౌరా, -న్యూఢిల్లీ మార్గంలో రైలు సర్వీసులు దాదాపు ఆరు గంటలపాటు నిలిచిపోయాయన్నారు. ‘‘మావోయిస్ట్లుల జరిపిన ఈ పేలుడులో చిచాకి , చౌదరిబంద్ స్టేషన్ల మధ్య రైలు ట్రాక్ పూర్తిగ దెబ్బతింది’’అని ఆయన చెప్పారు.

పేలుడు సంభవించిన తర్వాత రెండు స్టేషన్ల మధ్య రైలు సేవలను అర్ధరాత్రి 12.30 గంటలకు నిలిపివేసి, ఉదయం 6.30 గంటలకు పునరుద్ధరించినట్లు తెలిపారు. రైల్ ట్రాక్ ప్యానెల్ క్లిప్ దెబ్బతినడంతో  ఆ మార్గంలోని పలు రైళ్లను దారి మళ్లించారు.  కాగా, జార్ఖండ్ పోలీసుల మోస్ట్​ వాంటెడ్​ గా  ప్రకటించిన తమ అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దాను అరెస్టు చేసినందుకు నిరసనగా నిషేధిత మావోయిస్టులు  జార్ఖండ్‌లో 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. బోస్​పై ₹ 1 కోటి రివార్డు ఉంది.

జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో 100 కి పైగా దాడులు, దహన ఘటనల వెనుక బోస్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు చెబుతున్నారు. పేలుడు జరిగిన తర్వాత గిరిడిహ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ రేణు ఘటనా స్థలానికి చేరుకున్నారని, దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement