Tuesday, November 19, 2024

పోలీసుల‌కి లొంగిపోయిన – మావోయిస్టు సావిత్రి

పోలీసుల‌కి లొంగిపోయింది మావోయిస్టు సావిత్రి.ఆమె మావోయిస్టు దండకారణ్య కమిటీ సెక్రెటరీ రామన్న భార్య. 2019లో ఛత్తీస్‌గఢ్‌ అడువుల్లో రామన్న గుండెపోటు కారణంగా మృతి చెందాడు. రామన్నపై గతంలో పోలీసులు రూ.40లక్షల రివార్డును ప్రకటించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఝార్కండ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌గా రామన్న ఉన్నాడు. 1994లో దళ సభ్యురాలు సావిత్రిని రామన్న పెళ్లి చేసుకున్నాడు. సావిత్రి కుమారుడు రంజిత్‌ గతేడాది పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత సావిత్రి సైతం మావోయిస్ట్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తుంది. లొంగుపాటుపై పోలీసులు ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement