జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పెగడపల్లి కనుకనూరు, రెడ్డిపల్లి గ్రామాలలో 50 ఆకుల తునికాకు కట్టకు మూడు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టులు శనివారం రాత్రి కరపత్రాలను వేశారు. కరపత్రంలో ఇలా… అమ్మబోతే అడవి కొనబోతే కొరివిగా తయారయింది. ఈ వెసవి సీజన్లో తూనికాకు కార్మికుల శ్రమకు న్యాయమైన ధరలను చెల్లించాలిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తునికాకు కాంట్రాక్టర్లను డిమాండ్ చేయండని, 50 ఆకుల కట్టరు 3 రూపాయాలు, మోదం కచ్చిన కూలికి రోజుకు 500 రూపాయలు చెల్లించాలి. కల్లేదార్, లూజింగ్ కార్మికుల వేతనాలు పెంచాలి. తునికాకు సేకరిస్తున్న గ్రామాల్లో గ్రామాభివృద్ధి ఫండ్ ను, తునికాకు బోనసమ ప్రభుత్వం చెల్లించాలి. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి 5 లక్షల రూపాయాలు, గాయపడిన వారికి 2 లక్షలు రూపాయల ఎక్స్ గ్రేషియాను చెల్లించాలి. 5వ, 6వ షెడ్యూల్, పిసా చట్టాల ప్రకారం సర్వాధికారాలు అధికారాలు గ్రామ సభలకే కట్టకట్టాలి.సొసైటీలకే తునికాకు యూనిట్లు వర్తింప చేసి గ్రామ సభలలో తునికాకు సంబంధిక ధరలు నిర్ణయించబడాలి. తదితర డిమాండ్లను సాధించుకునే వరకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిస్తూ భూపాలపల్లి-మహబూబాబాద్- వరంగల్ 2 పెద్దపల్లి (జెయమ్ డబ్ల్యూసీ) డివిజన్ కమిటీ.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పేరున కరపత్రాలు వదలడంతో అటవీ గ్రామాల్లో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు అలర్ట్ అయ్యారు.