మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలతో విసిగిపోయిన దళం సభ్యుడు మాచర్ల గణపతి అలియాస్ నరేందర్ జనజీవన స్రవంతిలో కలిసేందుకు ములుగుజిల్లా ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్ ఎదుట మంగళవారం లొంగిపోయాడు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన గణపతి అలియాస్ నరేందర్ 2107లో దొమ్మాటి సమ్మయ్య ద్వారా సిపి బాట దళంలో చేరాడు. ఉల్వనూరు అటవీప్రాంతంలో మావోయిస్టు ప్రధాన నాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తో పరిచయమైన తరువాత సీపీఐ మావోయిస్టు పార్టీ కొరియర్ గా చేశాడు. ఈ క్రమంలో 2018లో చర్ల పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం 2021లో మళ్లీ సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరి ఒక నెల శిక్షణ తరువాత 2వ సెంట్రల్ రిజర్వ్ కంపెనీ కోసల్ ప్లాటూన్ లో పనిచేశాడు. అయితే, మావోయిస్ట్ సిద్దాంతాలు నచ్చక పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు దళ సభ్యుడు తెలిపాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement