తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలయ్యింది. చాలాకాలంగా సైలెంట్‌గా ఉన్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న (బుధవారం) అర్ధరాత్రి ములుగు జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది. పోలీసులకు సమాచారం అందిస్తున్నాడన్న కారణంగా ఓ వ్యక్తిని గొడ్డళ్లతో నరికిచంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ములుగు జిల్లా వెంకటాపురంలో మావోయిస్టులు రెచ్చిపోయారు, ఇన్ఫార్మర్ అనే నెపంతో కొండాపూర్‌కు చెందిన గోపాల్ అనే వ్యక్తిని బుధవారం రాత్రి దారుణంగా హతమార్చారు. గొడ్డలితో దాడి చేయగా గోపాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు పోలీస్ ఇన్ఫార్మర్లకు ఇదే గతి పడుతుందని మావోయిస్టులు ఓ లేఖ కూడా వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారే.