ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ (కేకే) మంగళవారం రాత్రి కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. కేకే హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను ఆలపించారు. తెలుగులో కూడా సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. మనం చాలా పాటలు అతని పాటలు వింటున్నాం.. అవేంటో ఓసారి పరిశీలిస్తే…
1994లో వచ్చిన డబ్బింగ్ సినిమా ప్రేమదేశంలో కాలేజ్ స్టైల్, హలో డాక్టర్ లాంటి సూపర్ హిట్ సాంగ్స్‌తో తెలుగులో కేకే ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఖుషిలో ఏ మేరా జహా సాంగ్ యూత్‌ను అప్పట్లో ఎంత ఉర్రూతలూగించింది. ఈ పాటను మణిశర్మ స్వరపరిచగా కేకే పాడారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్ స్వరపరిచిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను కూడా ఆయన పాడారు. వాసు సినిమాలో పాటకు ప్రాణం, ఘర్షణలో చెలియా చెలియా, అపరిచితుడులో కొండకాకి కొండెదాన, మున్నా సినిమాలో రెండు పాటలను ఆయన పాడారు.
అలాగే ఆర్యలో ఫీల్ మై లవ్, శంకర్‌దాదా ఎంబీబీఎస్ల్ చైలా చైలా, నా ఆటోగ్రాఫ్‌లో గుర్తుకొస్తున్నాయి, గుడుంబా శంకర్‌లో లే లే లెలే, జల్సాలో మై హార్ట్ ఈజ్ బీటింగ్, ఓయ్లో వెయిటింగ్ ఫర్ యు, ఆర్య 2లో ఉప్పెనంత, ప్రేమ కావాలిలో మనసంతా ముక్కలు చేసి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో టైటిల్ సాంగ్… తన పాటల్లో కొన్ని ప్రముఖమైనవి.
2014లో ఎవడు సినిమాలో ‘చెలియా చెలియా’ పాటను కూడా కేకే పాడారు. అదే సంవత్సరం హిందీ సినిమా ఆషికి 2కి రీమేక్‌గా తెరకెక్కిన నీ జతగా నేనుండాలి సినిమాలో పాడిన ‘కనబడునా’ అనేది కేకే చివరి పాట. భౌతికంగా మనకు దూరమైనా కేకే తన పాటల ద్వారా ఎప్పుడూ మనతోనే ఉంటారు.