ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని ప్రజలు అంటూ ఉంటారని నాగాలాండ్ ఉన్నతవిద్య..గిరిజన వ్యవహారాల మంత్రి తెంజెన్ ఇమ్నా అలోంగ్ అన్నారు. కాగా తమకు చిన్న కళ్లు ఉన్నమాట వాస్తవమేనని, అయితే కంటి చూపు మాత్రం అమోఘంగా ఉంటుందన్నారు. అంతేకాదు, కళ్లు చిన్నగా ఉండడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను కూడా చెప్పుకొచ్చారు. కళ్లు చిన్నగా ఉండడం వల్ల దుమ్ము, ధూళి లోపలికి వెళ్లదని, అలాగే ఏదైనా ఎక్కువసేపు కొనసాగే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నిద్రపోయినా ఎవరూ గుర్తించలేరని ఆయన చెప్పడంతో ఒకసారిగా నవ్వులు విరిశాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో మంత్రి హస్యచతురకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే వీడియోను షేర్ చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెంజెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈశాన్య ప్రజల తరపున గళం వినిపించినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు.