అతి పెద్ద నిర్మాణ రంగ సంస్థ అయిన మంత్రి డెవలపర్స్ సీఎండీ సుశీల్ అరెస్టు అయ్యారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. అయితే.. బెంగళూరులో కొనుగోలుదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు సమాచారం. ఆ డబ్బులను దారి మళ్లించినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.
పలు ప్రాజెక్టుల పేరుతో డబ్బులు వసూలు చేసిన మంత్రి కన్స్ట్రక్షన్స్ సీఎండీ సుశీల్ దాదాపు 5వేల కోట్లు తన వ్యక్తిగతంగా వాడుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై బెంగళూరులో అతడిని ఈడీ ఇవ్వాల (శనివారం) అరెస్టు చేసింది. అంతేకాకుండా పది రోజుల ఈడీ కస్టడీకి కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. ప్రాజెక్టుల పేరుతో ఫైనాన్స్ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది.
- Advertisement -