టీ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఈ టీ పొడిలో ఎన్నో వేల రకాలు ఉన్నాయి..మసాలా టీ అని, అల్లం టీ ఇలా పలురకాలుగా ఉన్నాయి. టీ ఎంత ఉంటుంది రూ. 10. మరి కిలో టీపౌడర్ ధర ఎంత ఉంటుంది వందో, రెండు వందలో .. కానీ లక్ష రూపాయలు ఉండదుగా.. కానీ అదే జరిగింది. ఓ వేలం పాటలో టీ ధర లక్షకి చేరువయింది. ఎక్కడా అనుకుంటున్నారా అసోం రాజధాని గువాహటిలో.. ఇక్కట టీ వేలం పాట కేంద్రంలో మనోహరి గోల్డ్ టీ వేలంపాటని చేపట్టారు. కాగా కిలో రూ. 99,999కి సౌరవ్ టీ ట్రేడర్స్ టీ పొడి టెండర్స్ ని దక్కించుకుని రికార్డ్ సృష్టించింది. కిలో ధర ఇంత పలకడం ఇదే మొదటిసారి.
కాగా గత ఏడాది నిర్వహించిన వేలం పాటలో మనోహరి గోల్డ్ టీ కిలో రూ.75,000 పలికింది. ఆ ఏడాది ఇదే అత్యధిక ధర అనుకుంటే ఇప్పుడా రికార్డ్ ని చెరిపేసి కొత్త రికార్డ్ ని సృష్టించారు. .గువాహటి టీ వేలం పాట కేంద్రంలో కిలో గోల్డ్ టీ రూ.99,999 పలికింది. నాణ్యత విషయం మేం ఎప్పుడు రాజీ పడలేదు. మా దగ్గర నాణ్యతకు అంత ప్రాధాన్యత ఉంటుంది. మేం ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే అసోం టీ కీర్తిని మరోసారి ఎలుగెత్తి చాటాం అని మనోహరి టీ ఎస్టేట్స్ యజమాని రాజన్ లోహియా వెల్లడించారు. మేం ఉత్తమమైన లవంగం పీ-126తో చిన్న మొగ్గతో టీని తయారు చేశాం. ప్రతి సంవత్సరం 10 కిలోల గోల్డ్ టీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ, ఈ ఏడాది కేవలం 2 కిలోలు మాత్రమే దిగుబడి వచ్చింది. టీ ఉత్పత్తికి అసోం రాష్ట్ర వాతావరణం, నేల నాణ్యత చాలా బాగా ఉన్నాయని .. మేం నాణ్యతకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం అని లోహియా తెలిపారు. కాగా మనోహరి ఎస్టేట్స్ సుమారు 1000 ఎకరాల్లో విస్తరించింది. ఇక్కడ 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..