గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఇవ్వాల గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. తన తండ్రి కాంటెస్ట్ చేసిన పంజిమ్ నియోజకవర్గం నుండి టిక్కెట్ ఆశించగా బీజేపీ దాన్ని తిరస్కరించింది. కాగా, ఫస్ట్ లిస్టులోనూ అతనికి టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో బీజేపీకి ఉత్పల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గోవాతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 10న ప్రారంభమై మార్చి 10న ఓట్ల లెక్కింపుతో ముగుస్తాయి.
పంజాబ్‌లో అకాలీదళ్ అమృత్‌సర్ (తూర్పు) స్థానం నుండి మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియాను పోటీకి దింపింది, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన జయంత్ చౌదరికి మరోసారి ఆలోచించాలని బీజేపీ ఆహ్వానం పంపినట్లు పొలిటికల్ వర్గాలు తెలిపాయి. అయితే.. చౌదరి దీన్ని తిరస్కరిస్తూ ట్వీట్ చేశారు. “ఆహ్వానం నాకు కాదు, మీరు ఇళ్లను నాశనం చేసిన 700 మంది రైతు కుటుంబాలకు ఇవ్వండి!!” అని అఖిలేష్ యాదవ్‌తో పొత్తు పెట్టుకున్నారు.