Thursday, November 21, 2024

Mann Ki Baat: ప్రపంచవ్యాప్తంగా భారతీయ వస్తువులకు డిమాండ్: ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా భారతీయ వస్తువులకు డిమాండ్ పెరగడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆదివారం మ‌న్ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. భార‌త్ నుంచి విదేశాల‌కు ఎగుమ‌తులు పెరిగాయ‌ని తెలిపారు. భారతదేశం 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని (30 లక్షల కోట్ల రూపాయల) సాధించిందని ఆయ‌న చెప్పారు. గ‌తంలో ఎగుమతుల విలువ‌ 100 బిలియన్ డాల‌ర్లు, కొన్నిసార్లు 150 బిలియన్ డాల‌ర్లు, కొన్నిసార్లు 200 బిలియన్ డాల‌ర్లు ఉండేవ‌ని ఆయ‌న వివరించారు. ఇప్పుడు మాత్రం ఏకంగా 400 బిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్ లో తయారయ్యే వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని దీని ద్వారా తెలుస్తోందని ఆయ‌న తెలిపారు. మ‌న‌ సంకల్పాలు, ప్రయత్నాలు మ‌నం క‌నే కలల కంటే గొప్ప‌గా ఉంటే విజయం త‌ప్ప‌క వ‌రిస్తుంద‌ని పేర్కొన్నారు. లడఖ్‌లోని నేరేడు పండ్ల నుండి, ఉస్మానాబాద్ నుండి చేనేత ఉత్పత్తుల వరకు – భారతీయ ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement