ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో తొలిదశ పోలింగ్ నేడు కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా 5 జిల్లాల పరిధిలోని 38 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలివిడతలో సీఎం బీరేన్ సింగ్, ఉపముఖ్యమంత్రి జాయ్‌కుమార్ సింగ్ బరిలో ఉన్నారు. అలాగే, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు లోకేశ్ సింగ్ కూడా బరిలో ఉన్నారు. మణిపూర్‌లోని 60 స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 5న మణిపుర్‌లో 22 స్థానాలకు రెండో విడత పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, మణిపూర్ తొలివిడత ఎన్నికలు ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే, ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి కాకపోవడం వల్ల సోమవారానికి వాయిదా పడ్డాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement