తన కారుపై పడిన పువ్వులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలపైకి విసిరారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యలో ఆదివారం పర్యటించారు మోడీ. కాగా మాండ్యలో మోడీ నిర్వహించిన రోడ్ షో కు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి మోడీకి స్వాగతం పలికారు ప్రజలు. కారుపై నిలబడి ప్రజలకు అభివారం చేస్తూ మోడీ రోడ్ షో లో ముందుకు సాగారు. తనకు ఘనంగా స్వాగతం పలికినందుకు గాను మాండ్య ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించే సమయంలో ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి పూలు చల్లారు. తన కారుపై పడిన పూలను మోడీ ప్రజలపైకి విసిరారు. ప్రజలకు నవ్వుతూ అభివాదం చేశారు. సంప్రదాయరీతిలో తనకు స్వాగతం పలికిన జానపద కళాకారులకు మోడీ కారు దిగి అభివాదం చేశారు. పాత మైసూరు ప్రాంతంలో 1.8 కి.మీ రోడ్ షో సాగింది. ఈ ప్రాంతంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ రోడ్ షో ను ఏర్పాటు చేశారు. మాండ్య జిల్లాలోని మద్దూరు తాలుకా గెజ్జలగెరె కాలనీలో రూ. 8,480 కోట్ల అంచనా వ్యయంతో ప్రధాని శంకుస్థాపన చేశారు. బెంగుళూరు-మైసూర్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మైసూరు-కుశాల్ నగర్ నాలుగు లైన్ల రహదారికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో సుమారు రూ. 16 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును మోడీ ప్రారంభించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement