Friday, November 22, 2024

అనుమానాలు రేకేత్తిస్తున్న హిమాచల్ బీజేపీ ఎంపీ మరణం

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శ‌ర్మ (62) బుధవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకోవడం కలకలం రేపింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మండీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వరూప్ శర్మ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 2014లో ఆయ‌న తొలిసారి పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. విదేశాంగ వ్య‌వ‌హారాలకు చెందిన స్టాండింగ్ క‌మిటీలో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు.

ఎంపీ రామ్ స్వ‌రూప్ శ‌ర్మ‌కు భార్య‌, ముగ్గురు కుమారులు ఉన్నారు.ఎంపీ స్వ‌రూప్ శ‌ర్మ గ‌త కొన్నాళ్ల నుంచి తీవ్ర మాన‌సిక‌క్షోభ‌లో ఉన్నారు. ఆరు నెల‌ల నుంచి డిప్రెష‌న్ చికిత్స తీసుకుంటున్నారు. ఢిల్లీలో ప్ర‌స్తుతం ఆయ‌న ఒంటరిగా ఉంటున్నారు. ఆయ‌న భార్య .. చార్‌థామ్ యాత్ర‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. శ‌ర్మ‌కు చెందిన ప‌ర్స‌న‌ల్ సెక్యూర్టీ ఆఫీస‌ర్ ప్ర‌స్తుతం మండీలో ఉన్నారు. కాగా ఎంపీ స్వ‌రూప్ ఆత్మ‌హ‌త్య‌పై పలు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement