మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) ఎన్నికలు ముగిసినా.. మంచు విష్ణు ప్యానెల్ గెలుపుపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపణలు చేస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్ కి సంబంధించిన వివాదం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించాడు.
‘మా’ ఎన్నికలు ప్రజాస్వామ్యంగానే జరిగాయి అని అన్నారు. పోలింగ్ లో చిన్న చిన్న స్పర్ధలే తప్ప ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. సిసి ఫుటేజ్ ను చూసుకోడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్న విష్ణు… మా బైలా మార్చడానికి కృషి చేస్తాం అని చెప్పారు. ప్రకాష్ రాజ్, నాగబాబు, ఇతర సభ్యుల రాజీనామాలు తనకు అందలేదన్న విష్ణు.. లేఖలు అందిన తర్వాతే స్పందిస్తానని చెప్పారు. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ను సమర్ధిస్తానన్న విష్ణు. టిక్కెట్ ధరల పెంపుపై ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు.
ఆదివారం జరిగిన అలయ్ బలాయ్ కార్యక్రమంలో తాను, పవన్ కల్యాణ్ తో మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే, వేదికపైన ఉప రాష్ట్రపతి ఉన్నందున పవన్ కల్యాణ్, తాను మాట్లాడుకోలేదని, వేదికపై వెళ్ళేముందు బాగా మాట్లాడుకున్నామని చెప్పారు. తన తండ్రి మోహన్ బాబు, చిరంజీవి మంచి మిత్రులు అని, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవి-మోహన్ బాబు ఎన్నికల అనంతరం ఫోన్‌లో మాట్లాడుకున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేయొచ్చని చెప్పారు. తెలుగు వాళ్ళు మాత్రమే ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయాలని తాము ఎక్కడా ప్రకటించలేదని విష్ణు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీకి బండి సంజయ్… మతలబ్ క్యా హై?