‘మా’ ఎన్నికల సమయం దగ్గర పడింది. అక్టోబర్ 10న ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షబరిలో నిలిచిన మంచు విష్ణు తమ మేనిఫెస్టోని ప్రకటించారు. కళాకారుల కోసం ప్రభుత్వంతో మాట్లాడి సొంత ఇళ్లు కటిస్తామని హామీ ఇచ్చారు. దాంతోపాటు సొంత ఖర్చులతో ‘మా’ కొత్త బిల్డింగ్ నిర్మిస్తామని తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న కొంతమంది సభ్యులు సినిమాల్లో నటించేందుకు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘మా యాప్’ ద్వారా సభ్యుల పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసి, నిర్మాతలు, దర్శకులు, రచయితలకు అందిస్తామన్నారు. జాబ్ కమిటీ ద్వారా వారందరికీ సినిమాలు, ఓటిటి వంటి మాధ్యమాల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు.
అర్హులైన మా సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత నివాస గృహం నిర్మిస్తామన్నారు. దాంతోపాటు ‘మా’లో ఉన్న ప్రతి సభ్యుడు, వారికుటుంబ సభ్యులకు ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్‌ఐ, హెల్త్‌కార్డులు, పిల్లలకు కేజీ టు పీజీ వరకు విద్యాసాయం అందిస్తామన్నారు. ప్రతి మూడు నెలలకు ఓసారి మెగా వైద్య శిబిరం పెడతామని చెప్పారు. ‘మా’ సభ్యుల కుటుంబంలో పెళ్లికి రూ.1.16 లక్షలు ఇస్తామని మంచు విష్ణు చెప్పారు. మహిళల రక్షణకు హై పవర్ ఉమెన్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. వృద్ధ కళాకారులకు రూ.6 వేలకు పైగా పింఛన్ ఇస్తామని స్పష్టం చేశారు.తాము గెలిస్తే ‘మా’ సభ్యత్వ రుసుము రూ.లక్ష నుంచి రూ.75 వేలకు తగ్గిస్తామని విష్ణు చెప్పారు. జూన్‌లో మోహన్‌బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఇన్స్టిట్యూట్లో ‘మా’ సభ్యులకు 50 శాతం ఉపకారవేతనం అందిస్తామని అన్నారు. వృద్ధ కళాకారులకు ‘మా’ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని మంచు విష్ణు చెప్పారు.
ఇది కూడా చదవండి: డ్వాక్రా మహిళలను మోసం చేశారు: చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్