మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎన్నికల్ ప్రకాష్ రాజు ప్యానెల్ తరుపున గెలిచిన సభ్యుల రాజీనామాలను ఆమోదించారు. మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన ఏకంగా.. 11 మంది అసోషియేషన్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విష్ణు ఇబ్బందులు ఉండకూడదనే తమ మెంబర్స్ రాజీనామా చేసినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు.
అయితే, ఆ రాజీనామాలను తాను ఆమోదించనని మొదట్లో మంచు విష్ణు తెలిపాడు. అయితే, తాజాగా ఆ 11 మంది అసోషియేషన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించారు. ఈ మేరకు మా అసోసియేషన్ కార్యాలయం అధికారికంగా ప్రకటన చేసింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీకాంత్, ఉత్తేజ్ సహా మొత్తం 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. రాజీనామాలు చేయొద్దని కోరినా.. వారు వెనక్కి తగ్గకపోవడంతో రాజీనామాలను ఆమోదించినట్లు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.