సినిమా నిర్మాతగా వ్యవహరించడం కష్టమేనంటోంది నటి..నిర్మాత..మంచులక్ష్మీ. నిర్మాతలను కేవలం ఫైనాన్షియర్లుగానే చూస్తున్నారు. సినిమా నిర్మాణంలో వారి పాత్ర కనుమరుగవుతోందన్నారు. అయితే మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. చాాలా ఇరిటేట్గా ఉంది.. నిర్మాతల కష్టాలు.. యాక్టర్స్ లైఫ్ సో బెటర్ అంటూ హ్యాష్ ట్యాగ్లతో ట్వీట్ చేసింది. ప్రతీ రోజూ సమస్యలు ఎదురవుతుంటాయి.. వాటిని ఎదుర్కొని నిలబడాలి.. ఓ సినిమాను నిర్మించాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి.. అందరినీ మ్యానేజ్ చేయాలి..సమర్థవంతంగా ఉండాలి.. నిర్లక్ష్యం, ఈగోలు, యాటిట్యూడ్ వంటివి ఎక్కువగా ఉంటాయి.. అప్పటి నుంచి ఒక్క షాట్ కోసం ఎదురుచూస్తున్నా.. చాలా ఇరిటేట్ అవుతోంది.. నిర్మాతల కష్టాలు.. యాక్టర్స్ బతుకే సో బెటర్ అని ట్వీట్ వేసింది. మంచు లక్ష్మీ ఇప్పుడు తమిళం, మళయాలం సినిమాలతోనూ బిజీగా ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement