ఆర్టీసీ బస్సుల కంటే క్యాబుల్లో ప్రయాణించేందుకు చాలా మంది ఇష్టపడతారు. హైదరాబాద్ లాంటి నగరంలో క్యాబుల వినియోగం అధికంగా ఉంటుంది. అల్లు అర్జున్ లాంటి హీరో సైతం ఆర్టీసీ కంటే ర్యాపిడోలో అతి తక్కువ ఛార్జితో హాయిగా ప్రయాణించండి అంటూ యాడ్ కూడా చేశారు. అయితే, ఇది వివాదం కావడం.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బన్నీకి నోటిసులు పంపడం కూడా జరిగింది. అయితే, ప్రైవేటు వాహనాలతో పొల్చితే ఆర్టీసీనే బెటర్ అనే ప్రయాణికులు భావిస్తున్నారు. క్యాబ్ ధరల కంటే ఆర్టీసీలోనే అతి తక్కువ ఛార్జిలతో గమ్య స్థానాలకు చేరుతున్నారు.
తాజాగా ఓ వ్యక్తి ఆఫిస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ కోసం ట్రై చేశాడు. అయితే, తన గమ్య స్థానానికి వెళ్లేందుకు రూ.555 ఛార్జి ఉంది. దీంతో సదరు వ్యక్తి ఆర్టీసీ బస్సు ఎక్కాడు. తన గమ్య స్థానం చేరుకునేందుకు మూడు బస్సులను మారాడు. అయితే, దీనికి అయిన ఖర్చు కేవలం రూ.55 రూపాయాలు మాత్రమే. క్యాబ్ ప్రయాణానికి రూ.555 ఉండగా.. బస్సుల్లో ప్రయాణించేందుకు రూ.55 మాత్రమే టికెట్ ధర చెల్లించాడం గమనార్హం. ఆర్టీసీలో బస్సులో అతి తక్కువ ఖర్చుతో, సురక్షితమైన ప్రయాణం చేశానంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్… సదరు ప్రయాణికుడికి ధన్యవాదాలు తెలిపారు.