Friday, November 22, 2024

Spl Story: లగ్జరీ లైఫ్ వదిలేసి, గాడిదలు కాస్తున్న ఐటీ ఉద్యోగి.. ఎందుకో తెలుసా!

లక్షల్లో ఇన్​కమ్​ వచ్చే జాబ్​.. గౌరవప్రదమైన ఉద్యోగం.. లగ్జరీ లైఫ్​.. వీకెండ్​లో ఫుల్​ పార్టీస్​.. అయినా ఇవన్నీ తనను సంతృప్తి పరచలేదు. ఇక తన గమ్యస్థానం ఇది కాదనుకున్నాడో ఐటీ ఉద్యోగి. ఈ లైఫ్​ వదిలేసి తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలనుకున్నాడు. అయితే.. అందరికంటే కొత్తగా ఉండేలా, చాలామందికి ఉపయోగపడేలా ఉండాలని ఆలోచన చేశాడు.

ఇంకేముంది 42 లక్షల పెట్టుబడితో గాడిదలను కొనుగోలు చేశాడు. ఐటీ జాబ్​ వదిలేసి గాడిదలను కాయడం ఏంటని అనుకుంటున్నారా? ఇక్కడే మీరు తప్పులో కాలేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గాడిద పాలకు ఫుల్​ డిమాండ్​ ఉంది. అందుకనే ఈ రంగాన్ని ఎంచుకున్నట్టు చెబుతున్నాడు మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ.

ప్రస్తుతానికి తన వద్ద 20 గాడిదలున్నాయి. మంగుళూరులో గాడిద పాల ఫారమ్‌ను ప్రారంభించాడు శ్రీనివాస్ గౌడ్. 2020 వరకు సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేశానని, తనకు ఆ జాబ్​ సంతృప్తిని ఇవ్వలేదన్నారు. ఇ దేశంలోనే కర్ణాటకలో మొదటి గాడిదల పెంపకం,శిక్షణా కేంద్రం ప్రారంభించినట్టు తెలిపాడు.

గాడిద పాల వల్ల కలిగే ప్రయోజనాలు మరియు పొలం కోసం తన ప్రణాళిక గురించి గౌరవంగా చెబుతున్నాడు శ్రీనివాస్​గౌడ్​..  “ప్రస్తుతం మా వద్ద 20 గాడిదలున్నాయి.  నేను సుమారు రూ. 42 లక్షల పెట్టుబడి పెట్టాను, మేము గాడిద పాలను విక్రయించడానికి ప్లాన్ చేస్తున్నాం, ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గాడిద పాలు అందరికీ అందుబాటులో ఉండాలనేది మా కల. గాడిద పాలు ఒక ఔషధ ఫార్ములా.” అంటున్నాడు శ్రీనివాస్​ గౌడ్​.

అంతేకాకుండా గాడిద జాతుల సంఖ్య తగ్గుముఖం పట్టడం కూడా తనను ఆలోచనలో పడేసిందని తెలిపాడు గౌడ.  అందుకని గాడిద ఫారమ్ పెట్టానని, దీని గురించి మొదట్లో ప్రజలు నమ్మలేదని చెప్పుకొచ్చాడు. 30 ml  గాడిదల పాల ప్యాకెట్ ధర రూ. 150 గా అమ్ముతున్నట్టు తెలిపాడు. ఈ పాల ప్యాకెట్లు మాల్స్, దుకాణాలు, సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయని గౌడ  తెలిపాడు. ఇప్పటికే రూ.17 లక్షల విలువైన ఆర్డర్లు వచ్చాయని సంతోషంగా చెబుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement