బెంగళూరులో బైక్‌పై నుంచి పడి 44 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మొన్న (ఆగస్టు 18వ తేదీ గురువారం) జరిగింది. అయితే.. బైకు గుంతల్లో పడడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటన బ్యాదరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాగా, కుటుంబసభ్యుల ఆరోపణపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలో అతడు రోడ్డుపై పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే, స్పాట్లో ఎలాంటి గుంతలు లేవని, ఈ 44 ఏళ్ల వ్యక్తి మరణానికి కారణమైన గుంత ప్రమాదం జరిగిన ప్రదేశానికి కాస్త దూరంలో ఉందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అతను ఫోన్లో మాట్లాడుతున్నాడని, బైక్‌ని ఒక చేత్తో నడుపుతున్నాడని తెలిపారు. కానీ, ప్రమాదానికి గుంతలే కారణమన్న కుటుంబీకుల ఆరోపణలపై కూడా విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.