ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. కరోనా అంటేనే ఆమడ దూరం పరుగులు తీసే పరిస్థితులను నిత్యం మనం చూస్తున్నాం. కరోనాతో పోరాడి మృత్యువు ఒడిలో ఒదిగిన వారి అంతిమ సంస్కారాలకు బంధువులు సైతం దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంధువులు రాకపోతేనేం తాము ఉన్నాం అంటూ చనిపోయిన మిత్రుడి కోసం ముందుకు వచ్చారు కొందరు యువకులు.
అనారోగ్యంతో మృతి చెందిన స్నేహితుడికి మిత్రులు స్వచ్ఛంద సంస్థ సభ్యులే చివరి మజిలీలో ఆప్తులయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలులో చోటుచేసుకుంది. గాధం శెట్టి గుప్త అనే వ్యక్తి కొమరోలులో ఓ ప్రవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం టైఫెడ్ జ్వరంతో చికిత్స పొందుతూ.. ఆకస్మాత్తుగా ప్రాణాలొదిలారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అంత్యక్రియలు నిర్వ హించడానికి బంధులెవరూ ముందుకు రాలేదు. దీంతో స్నేహితులే స్పందించి పెయిర్ హ్యాండ్స్ సంస్థ సభ్యులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.