Friday, November 22, 2024

Chicken Curry: చికెన్ వండలేదని భార్యపై భర్త ఫిర్యాదు..

భార్య చికెన్ వండలేదని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడో భర్త. ఈ వింత సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. కనగల్ మండలం చర్ల గౌరారానికి చెందిన ఓర్సు నవీన్‌ అనే యువకుడు హోలీ పండగ రోజు తన భార్య చికెన్ వండిందేమోనని ఎంతో ఆత్రుతగా చూశాడు. కానీ ఆమె చికెన్ వండకపోవడంతో అతని కోపం కట్టలు తెంచుకుంది. ఏం చేయాలో అర్థం కాలేదు.. వెంటనే డయల్ 100‌కు ఫోన్ చేశాడు మద్యం మత్తులో హోలీ పండుగ రోజు డయల్ 100కు ఆరు సార్లు ఫోన్‌ చేశాడు. దీంతో ఏ ప్రమాదం జరిగిందో అని పోలీసులు  హుటాహుటిన అతని ఇంటికి వెళ్లారు. అయితే, అతడు చెప్పిన మాటలు విని పోలీసులు షాక్ అయ్యారు..

హోలీ పండగ రోజు తన భార్య చికెన్ తీసుకొచ్చి వంట చేసి పెట్టలేదని.. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై సీరియస్ అయ్యారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం తమ సమయం వృథా చేసినందుకు ఆ వ్యక్తిపై ఏకంగా కేసు నమోదు చేశారు. అత్యవసర సేవలు, ఆపద సమయంలో మాత్రమే 100కు డయల్‌ చేయాలని వారు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement