పాముని కేవలం చేతితో పట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఇందులో కొత్తేం ఉంది అనుకోకండి. అది మామూలు పాము కాదు..కింగ్ కోబ్రా. దాని పొడవు ఎంతో తెలుసా ఏకంగా 14అడుగులు ఉంది. అటువంటి పామును చూస్తే గుండె ఆగాల్సిందే. అయితే
నవ్హాద్ అనే వ్యక్తి ఆ పాముని చాక చక్యంగా ఒట్టి చేతులతో పట్టుకుని ఆశ్చర్యపరిచాడు. ఈ పాము పేరు జెయింట్ కోబ్రా. పది కిలోల బరువు ఉందా పాము. దక్షిణ థాయ్ ప్రావిన్స్ క్రాబీలో పాము తాటి తోటలోకి ప్రవేశించి సెప్టిక్ ట్యాంక్‌లో దాక్కోవడానికి ప్రయత్నించిన పాముని చూసి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. కింగ్ కోబ్రా ఒక విషపూరిత పాము జాతి, ఇది దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాకు చెందినది.
ఇది ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము, సగటు పొడవు 10 నుండి 13 అడుగుల వరకు ఉంటుంది. రికార్డు స్థాయిలో అతిపెద్ద కింగ్ కోబ్రాలలో ఇది కూడా ఒకటి.పాముని పట్టుకున్న వీడియోని అతను ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. ఒక సమయంలో, పాము దాని దవడ తెరిచి నవ్హాద్ ని కాటు వేసేందుకు ప్రయత్నించినట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. కింగ్ కోబ్రాను పట్టుకున్న తర్వాత దాని సహజ నివాస స్థలంలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు పాముని పట్టిన నవ్హాద్ చెప్పాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..