– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
కెనడా నుంచి మూడు బర్మీస్ కొండచిలువలను స్మగ్లింగ్ చేసినట్లు యూఎఎస్కి చెందిన వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. ఈ సరీసృపాలను యూఎస్-కెనడియన్ సరిహద్దు మీదుగా అక్రమంగా తరలించే ప్రయత్నంలో ఆ వ్యక్తి తన ప్యాంటులో వాటిని దాచుకున్నాడని తెలుస్తోంది. కాల్విన్ బటిస్టా అనే వ్యక్తి 2018 జులై 15న ఉత్తర న్యూయార్క్ కు వెళ్లే బస్సులో ఆ పాములను తీసుకెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది.
ఇక.. ఈ బర్మీస్ పైథాన్‌ల దిగుమతి అంతర్జాతీయ ఒప్పందం, సమాఖ్య చట్టంలో నిషేధం ఉంది. అయితే న్యూయార్క్‌కు చెందిన బటిస్టా వీటిని స్మగ్లింగ్ చేశాడనే నేరానికి సంబంధించి ఫెడరల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. బర్మీస్ పైథాన్‌లు మానవులకు హానికరమైనవన్న జాబితాలో ఉన్నాయి. ఫెడరల్ స్మగ్లింగ్ ఆరోపణలపై బటిస్టాని ఈ వారం న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీలోని కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత విచారణ పెండింగ్‌లో ఉండగానే అతడిని విడుదల చేశారు.
బర్మీస్ పైథాన్ ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటిగా చెబుతారు. ఆసియా ఖండంలో ఇది హానికరమైన పాము జాతిగా ఉంది. అయినప్పటికీ ఈ జాతి యునైటెడ్ స్టేట్స్ లోని ఫ్లోరిడాలో మనుగడ సాధించడం కష్టమనే తెలుస్తోంది. అయితే.. అక్కడ ఈ జాతి పాములు లోకల్ జంతువులను చంపి తినేస్తాయన్న వాదన స్థానికుల్లో ఉంది.