అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కొలరాడోలోని బౌల్డర్ నగరంలో ఓ సూపర్ మార్కెట్‌లో ప్రవేశించిన సాయుధుడు విచక్షణ రహితంగా కాల్పులకు తెబడ్డాడు. స్టోర్‌లోకి చొరబడిన నిందితుడు వెంటనే దాడికి పాల్పడ్డాడు.. పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 10 మంది మృతి చెందారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీస్ చీఫ్ మారిస్ హెరొల్డ్ తెలిపారు. ఈ ఘటనపై కొలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఇటీవల జార్జియాలో మూడు స్పాలపై ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు ఆసియా మహిళలు మృత్యువాతపడ్డారు. అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండడం కలకలం సృష్టిస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement